నీతో గడిపిన ఆ మధుర క్షణాలు
నా శ్వాసలో అణువణువున నిండి ఉన్నాయి
నీకై పరితపించే నా కన్నులు నిన్నే వెతుకుచున్నాయి
నీ నవ యవ్వన సౌందర్య దర్శనం కోసం
నా మనస్సు ఉవ్విళ్లూరుతుంది
నా అణువణువు నీ స్పర్శకై అలమటిస్తోంది
ఓ నేస్తమా నీ వెక్కడ ?
ఓ ప్రియ నేస్తమా ఆ నాటి మధురాలు శున్యమా ?
ఈ నాటి నా కళల జీవితం అందకారమయమా ?
నీతో నడిచిన ఆ నాలుగడుగులు నీకై నడవమంటున్నాయి
నీవు లేని నా జీవితం నిర్జీవం ...!
నీకై వేచిచూసే కన్నులతో ,
నీ ప్రేమకై పరితపించే మనసుతో
నీ రాక కోసం నే వేచిచూస్తూ ........
hi srinu,
ReplyDeleteits excellent
Thanks,
AShok.M