Sunday, July 31, 2011

లోకాలే చీకటైన....!

ఇది ఏమి  మాయ

నాలో కలిగిన అసంకల్పిత చర్య

నా మనస్సు నిద్రారణ్యంలో చిక్కి శల్యమై పోవుచున్నది

నిద్రించుటయా లేక పాఠములు పఠించుటయా ??

ఈ సంద్రంబు నుండి నను పడవేయవ ఓ శ్రీనివాసా ????

ఇవి పరీక్షల ప్రకంపనలులే...!

ప్రొద్దున్నే లేచాను నేను ఈ ప్రశాంత వాతావరణంలో

వేడి వేడి పానీయం అందుకున్నాను నా స్నేహితుని అభిమానంతో

ఎక్కడ లేని ఉత్సాహంతో రెపరెప లాడుతున్నాయి పుస్తకంలోని పేజీలు 

రివ్వుమంటోది మనసు పాఠ్యాంశంలోకి వెళితే

   ఇది ఆనంద సూచకమా లేక విషాద ఛాయకు అర్ధమా ? 
         అంతేలే ఇవి పరీక్షల ప్రకంపనలులే...!

ఇది రణరంగమా?

ఏమిటీ  ఈ తపన
              పరిపరి విధముల నిరీక్షణ
              మళ్లీ మళ్లీ ప్రయత్నమా ?
  వివిధ రకాల  విజృంభనయా ?
  ఎందుకీ పరి తపన ?
  విజయమా ? విఫల యత్నమా ?
                       ఈ విచిత్ర పరిక్షలలో ??

మత్తులో తుళ్ళింత........

ఈ ప్రశాంత సమయాన నే విహరిస్తున్న సడిలేని ధ్యాసలోన
     నా మనస్సు ఉరకలేస్తోంది ఈ నిర్విరామ ప్రపంచాన
     ఓ మనసా ఏమీ ఈ పులకరింత  ?
     ఏమీ ఈ మహత్తర జలదరింత
ఏదో తెలియని మత్తుతో తుల్లింతలవుతోంది నా మనసు
           ఇది వయస్సు ప్రభంజనమా ? లేక
                      పరీక్షల ప్రభావమా ??
 

ఓ మగువా !

నీ నవ్వుల్లో సౌందర్యాన్ని చూశా నీ నడకల్లో హొయలు చూశా

              నీ మాటల్లో సప్త స్వరాలను గ్రహించా
              నీ స్నేహంలో సప్త రుచులని చవిచూశా
              నీ ప్రేమలో స్వర్గ సుఖాలను అనుభవించా
              నీ చిరుకొపంలో అనురాగాన్ని చవిచూశా
              నీ కనుసైగల్లో అభిమానం చూశా
              నీ హృదయంలో నా మనస్సును(నా స్థానాన్ని ) చూశా
              నాలో నిండిఉన్న నా ఆరో ప్రాణమా 
                                 నా అభిమానమా
              ఇదే నా ప్రేమకు నిదర్శనం .....! 

నువ్వేనా నా నువ్వేనా ?

ఓ నేస్తమా ! ఓ ప్రియ నేస్తమా !
నా ప్రాణమా నా అనురాగమా
నా మదిలో దాగిన మధుర స్వరమా
నా హృదయాన రేగిన మలిస్వరమా

నీ రాకకోసం నా నీరిక్షణ, నా తపన 
నాలో సంగీతాన్ని పొంగిచిన మధుర మృదంగమా !
నీ ప్రేమలో నీ లాలనలో నీ పరితపించియున్న
నీవే నా సర్వస్వం నీకోసమే ఈ తపస్సు

మాయ

ఈ జగమే మాయ 
     నీవు నా పై చూపించిన ఆ ప్రేమ మాయ

నీ మనసులో నే చుసిన నా ప్రతిబింబం మాయ
    నా గుండెల్లో నిండిఉన్న నువ్వే మాయ

నీ మాటల్లో నీ నడవడికల్లో ఉన్న ప్రేమ మాయ
    ప్రేమే మాయ     మాయే ప్రేమ

ప్రేమలేని ఈ జగమే మహా మాయ
    ఈ జగత్తులో సర్వసం మాయ