Tuesday, August 2, 2011

ఇది నిద్రయా లేక అమృత భాండమా....!


ఈ మత్తులో జగమే ఊగుతోంది

కానీ నా శరీరం ఊగుతూ ఆగలేనంటూంది

మనసు దేనికో ఆరాటపడుతోంది

కళ్ళు ఎందుకో మిటమిటమంటున్నాయి

ఇది నిద్రయా లేక అమృత భాండమా....!      
 

మధుర క్షణాలు....!

నీతో గడిపిన ఆ మధుర క్షణాలు

      నా శ్వాసలో అణువణువున నిండి ఉన్నాయి

నీకై పరితపించే నా కన్నులు నిన్నే వెతుకుచున్నాయి

నీ నవ యవ్వన సౌందర్య దర్శనం కోసం

నా మనస్సు ఉవ్విళ్లూరుతుంది

నా అణువణువు నీ స్పర్శకై అలమటిస్తోంది

             ఓ నేస్తమా నీ వెక్కడ ?

ఓ ప్రియ నేస్తమా ఆ నాటి మధురాలు శున్యమా ?    

ఈ నాటి నా కళల  జీవితం అందకారమయమా   ?
నీతో నడిచిన ఆ నాలుగడుగులు నీకై నడవమంటున్నాయి
 
                  నీవు లేని నా జీవితం నిర్జీవం ...!
 
      నీకై వేచిచూసే కన్నులతో ,
 
           నీ ప్రేమకై పరితపించే మనసుతో
                         
                         నీ రాక కోసం నే వేచిచూస్తూ ........
 
 
 
 

Sunday, July 31, 2011

లోకాలే చీకటైన....!

ఇది ఏమి  మాయ

నాలో కలిగిన అసంకల్పిత చర్య

నా మనస్సు నిద్రారణ్యంలో చిక్కి శల్యమై పోవుచున్నది

నిద్రించుటయా లేక పాఠములు పఠించుటయా ??

ఈ సంద్రంబు నుండి నను పడవేయవ ఓ శ్రీనివాసా ????

ఇవి పరీక్షల ప్రకంపనలులే...!

ప్రొద్దున్నే లేచాను నేను ఈ ప్రశాంత వాతావరణంలో

వేడి వేడి పానీయం అందుకున్నాను నా స్నేహితుని అభిమానంతో

ఎక్కడ లేని ఉత్సాహంతో రెపరెప లాడుతున్నాయి పుస్తకంలోని పేజీలు 

రివ్వుమంటోది మనసు పాఠ్యాంశంలోకి వెళితే

   ఇది ఆనంద సూచకమా లేక విషాద ఛాయకు అర్ధమా ? 
         అంతేలే ఇవి పరీక్షల ప్రకంపనలులే...!

ఇది రణరంగమా?

ఏమిటీ  ఈ తపన
              పరిపరి విధముల నిరీక్షణ
              మళ్లీ మళ్లీ ప్రయత్నమా ?
  వివిధ రకాల  విజృంభనయా ?
  ఎందుకీ పరి తపన ?
  విజయమా ? విఫల యత్నమా ?
                       ఈ విచిత్ర పరిక్షలలో ??

మత్తులో తుళ్ళింత........

ఈ ప్రశాంత సమయాన నే విహరిస్తున్న సడిలేని ధ్యాసలోన
     నా మనస్సు ఉరకలేస్తోంది ఈ నిర్విరామ ప్రపంచాన
     ఓ మనసా ఏమీ ఈ పులకరింత  ?
     ఏమీ ఈ మహత్తర జలదరింత
ఏదో తెలియని మత్తుతో తుల్లింతలవుతోంది నా మనసు
           ఇది వయస్సు ప్రభంజనమా ? లేక
                      పరీక్షల ప్రభావమా ??
 

ఓ మగువా !

నీ నవ్వుల్లో సౌందర్యాన్ని చూశా నీ నడకల్లో హొయలు చూశా

              నీ మాటల్లో సప్త స్వరాలను గ్రహించా
              నీ స్నేహంలో సప్త రుచులని చవిచూశా
              నీ ప్రేమలో స్వర్గ సుఖాలను అనుభవించా
              నీ చిరుకొపంలో అనురాగాన్ని చవిచూశా
              నీ కనుసైగల్లో అభిమానం చూశా
              నీ హృదయంలో నా మనస్సును(నా స్థానాన్ని ) చూశా
              నాలో నిండిఉన్న నా ఆరో ప్రాణమా 
                                 నా అభిమానమా
              ఇదే నా ప్రేమకు నిదర్శనం .....!